Telangana Formation Day

Telangana Formation Day

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948 సెప్టెంబర్ 17 వ తేదీన “ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కలుపబడింది.1956 వ సంవత్సరంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు విభజించినప్పుడు ఆంధ్ర,తెలంగాణ, రాయలసీమ కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. తెలంగాణ ప్రజల కోరిక మేరకు సకల జనులంతా కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని సమ్మెలు చేయగా, ఎంతోమంది ప్రాణత్యాగ ఫలితంగా   జూన్ 2, 2014 వ సంవత్సరంలో “ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది.

భారతదేశంలో 29 వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 31 జిల్లాలతో అభివృద్ధి పథంలో పయనిస్తుంది .2020 జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని డి. ఎస్. , అత్తాపూర్ పాఠశాల విధ్యార్థులు తమ తెలుగు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వములో తెలంగాణ రాష్ట్రమునకు సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించారు. కోవిడ్ -19 కారణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని , విద్యార్థులు ఇంటివద్దనుండే ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలను చక్కగా వివరించారు . విద్యార్థులకు సహకరించిన వారి తల్లిదండ్రులకు ధన్యవాదములు.

Leave a reply

Your email address will not be published.